Saturday, 27 October 2018
Mulching
మల్చింగ్‌తో మిర్చి సాగు
20-10-2018 01:23:29
ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి కరువు పరిస్థితుల్లో కూడా మిర్చి సాగు ద్వారా సిరులు పండిస్తున్నారు ప్రకాశం జిల్లా కొత్తరెడ్డిపాలెం రైతులు. డ్రిప్‌తో పాటు మల్చింగ్ షీట్ ఉపయోగించి నీటిని, ఎరువులను, కూలీల ఖర్చును ఆదా చేసుకుని లాభాల పెంచుకుంటున్నారు.
కరువు పరిస్థితుల్లోనూ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం రైతులు సిరులు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్తరెడ్డిపాలెంలో 150 కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా బోరుబావుల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ బోర్లకు సరిగ్గా నీరు రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో డ్రిప్ ద్వారా నీటితడులు ఇవ్వడం ప్రారంభించారు.
అన్ని పంటలకు డ్రిప్ పద్ధతిలోనే నీటితడులు ఇస్తూ నీటిని ఆదా చేసుకుంటున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి మిర్చిని కూడా డ్రిప్ పద్ధతిలోనే సాగు చేయడం ఇక్కడి రైతుల ప్రత్యేకత. ఈ గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు ఇంకో అడుగు ముందుకేసి మల్చింగ్ పేపర్‌ను కూడా వినియోగిస్తూ నీటిని, ఎరువులను మరింత ఆదా చేసుకుంటున్నారు. మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగు చేస్తే నేలలో తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. తక్కువ నీటితోనే పంటను సాగు చేసుకోవచ్చు.
80 శాతం నీరు ఆదా
డ్రిప్, మల్చింగ్ విధానాల ద్వారా తక్కువ నీటితో ఈ ప్రాంత రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. సాధారణంగా ఒక ఎకరాకు వినియోగించే నీటితో నాలుగైదు ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్ విధానం వల్ల నీరు ఆదా కావడంతో పాటు కలుపు బెడద తగ్గుతుంది. నీరు మొక్కల వద్ద మాత్రమే పడటం వలన కలుపు వచ్చే అవకాశం ఉండదు. దీంతో కూలీల ఖర్చు తగ్గుతున్నది. అలానే ఎరువులను డ్రిప్ ద్వారా పంపించడం వల్ల ఎరువు ఆదా అవుతున్నది. మల్చింగ్ పేపర్ వినియోగం ద్వారా కలుపు మొక్కలు రాకుండా ఉండటంతో పాటు తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. మొక్కలకు ఎరువు సరిగా అందడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఆ గ్రామ రైతులు.
నాలుగింతల పొలానికి తడులు
డ్రిప్ ద్వారా ఎకరాకు ఉపయోగించే నీటితో 4 ఎకరాలకు నీటిని అందిస్తున్నాం. బోర్లలో నీరు లేదు. ఈ పరిస్థితుల్లో డ్రిప్ లేకపోతే సేద్యం మానుకోవాల్సి వచ్చేది. మూడేళ్లుగా డ్రిప్ పద్ధతిలోనే మిర్చి సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవటంతో డ్రిప్ రంధ్రాల వద్ద పడ్డ నీటి తేమలోనే మొక్కలు నాటుతున్నాం. మామూలుగా ఎకరాకు 40 బస్తాల ఎరువులు వినియోగిస్తుంటాం. డ్రిప్ ద్వారా 7 బస్తాలు సరిపోతుంది. ఎరువులు, కలుపు ఖర్చులు సగానికి పైగా తగ్గి లాభాలు పెరుగుతున్నాయి. మల్చింగ్ పేపర్ వినియోగించడం ద్వారా తేమ ఎక్కువ రోజులు ఉంటున్నది. కలుపు బెడద తప్పింది.
- కె. నాగిరెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, సంగు శ్రీలక్ష్మి, కొత్తరెడ్డిపాలెం
ప్రతి చుక్కా సద్వినియోగం
కొత్తరెడ్డిపాలెంలో రైతులందరూ డ్రిప్ ద్వారా పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మల్చింగ్ పేపరు ఉపయోగించి నీరు, ఎరువులు ఆదా చేస్తూ మిర్చి సాగు చేస్తున్నారు.
- నవీన్‌కుమార్, ఉద్యానశాఖ అధికారి, అద్దంకి
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అద్దంకి
zbnf reddy ananathapur
ఉద్యాన రైతుగా ఐటీ కంపెనీ బాస్ https://kalpatharuorganics.com/news
20-10-2018 00:54:28
జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ ఎరువులతో సాగు...మేళా, వెబ్‌సైట్ ద్వారా పండ్ల విక్రయం
అనంతపురం జిల్లాకు చెందిన ఆయన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత. ఆయన భార్య ఒక ఆర్గానిక్ కంపెనీ సారథి, ఇంజనీరింగ్ చదువుతున్న వారి కుమార్తెతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ రోడ్డు వెంట పంట నూర్పిడి చేస్తున్న రైతుల్ని చూశారు. దేశంలో మిగిలిన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుండగా వ్యవసాయం మాత్రం ఎందుకు సాంకేతికంగా వెనుకబడి వుందనే కూతురు ప్రశ్న ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేతలో ఆలోచనలు రేకెత్తించింది. ఆ కుటుంబం అడుగులు వ్యవసాయం వైపు పడేలా చేసింది. కరువులో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆదుకునేలా చేసింది. నగరంలో ఉద్యోగాలు చేసుకుంటూనే తీరిక వేళల్లో స్వగ్రామంలో బంధువుల సహకారంతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నదీ కుటుంబం.
వివిధ రకాల పంటలతో పాటు అరుదైన పండ్లతోటలు పెంచి ఆంధ్రా మామిడిపండ్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించి, ఒకటికి ఐదు రెట్ల లాభాలను గడిస్తున్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం రాగిమేకలపల్లికి చెందిన మసుకోట రాజశేఖర్ రెడ్డి వ్యాల్యూపాయింట్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. భార్య విజయ లక్ష్మి ఓ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. కుమార్తె పూజిత ఇంజనీరింగ్ చదువు తోంది. రాజశేఖర్‌రెడ్డి వృత్తిరీత్యా గత 20 ఏళ్లలో అమెరికా, ఐరోపా, ఆస్ర్టేలియా, ఆసియా ఖండాలలో పర్యటించి అపార అనుభవాన్ని గడించారు. సొంత జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు గమనించి, కుమార్తె మాటలతో స్ఫూర్తి పొందిన ఆయన 2009లో వ్యవసాయం ప్రారంభించారు.
రాగిమేకలపల్లి వద్ద 47 ఎకరాల పొలం ఉండగా మొదట 15 ఎకరాల్లో పండ్లతోటలు, చిరుధాన్య పంటలైన సామలు, కొర్రలు, ఉలవలు, అలసందలు సాగు చేశారు. మామిడిలో 11 రకాల చెట్లతో ప్రారంభించి ప్రస్తుతం తోటలో 28 రకాల పండ్ల చెట్లను సాగుచేస్తున్నారు. రెండువేల మామిడి మొక్కల్లో రత్నగిరి ఆల్ఫాన్స్ బెంగళూరు అగ్రికల్చర్ యూనవర్సిటీ నుంచి, కేసర్, ఇమాం పసంద్, తదితర రకాల చెట్లను రాజమండ్రి నుంచి తెప్పించారు. వాటితోపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి గాను ఆరెంజ్, అవకాడొ, బ్రెడ్‌ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, మ్యాంగో స్టీమ్, రోజ్ ఆపిల్, గోడంబి, రామాఫలం, జాక్‌ఫ్రూట్, చెర్రీస్, ఉసరి, పనస, అల్లనేరేడు తదితర రకాలు పెట్టారు. పొలంచుట్టూ ట్రెంచ్ ఏర్పాటుచేసి అవసరమైన చోట ఫారంపాండ్, చెక్‌డ్యామ్‌లు, గట్లు ఏర్పాటుచేశారు. వర్షం పడినప్పుడు నేలపై పడే ప్రతి చినుకూ భూమిలో ఇంకేలా చేశారు. ఇలా చేయడం ద్వారా ఒకే బోరుతో 15 ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగుచేస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తారు.
ఆస్ర్టేలియా, జర్మనీకి చెందిన నిపుణుల వద్ద ఎరువుల తయారీలో ఏడు రోజులు శిక్షణ పొందారు రాజశేఖర్‌రెడ్డి. జర్మన్ పద్ధతిలో తయారుచేసుకున్న మిశ్రమంతో పాటు సేంద్రియ ఎరువులతోనే అన్ని పంటలూ పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడికాయలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయించడం వల్ల రూ.15 లక్షల లాభాలు సాధించారు. ఇందుకోసం దంపతులిద్దరు బెంగళూరులో అపార్ట్‌మెంట్‌ల వద్ద మేళా ఏర్పాటుచేశారు. ఆంరఽధా పండ్లకు గిరాకీ పెరగడంతో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో ఆంధ్రమ్యాంగో డాట్‌కామ్, కల్పతరువు ఆర్గానిక్స్ పేరుతో తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక బాక్సుల్లో సరఫరా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తోటలో కిలో రూ.25 ధర పలికే మామిడిపండ్లకు రూ.150 లభించింది. వీరి వినూత్న సాగు పట్ల ఆకర్షితులైన పలువురు బడా కంపెనీ ఉద్యోగులు వారు కూడా గ్రామాలకు వెళ్లి పంటలు సాగు చేయడానికి సిద్ధం కావడం విశేషం.
స్వగ్రామంలో ప్రకృతి వైద్యశాల
ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని వ్యవసాయాభివృద్ధికి ఎలా ఉపయోగించాలనే అంశంపై ఐక్యరాజ్యసమితి కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాను. వ్యవసాయ క్షేత్రాన్ని విద్యార్థులు, రైతులకు స్ఫూర్తినిచ్చే రీతిలో తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. జర్మన్ పద్ధతిలో తయారుచేసే ఎరువును స్థానిక రైతులకు తక్కువ ధరకు విక్రయించాలని ఆలోచిస్తున్నాను. త్వరలో రాగిమేకల వద్ద ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం. పండ్ల మొక్కల నర్సరీ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తాం. విద్యార్థులు తాను ఇచ్చిన మొక్కలను పెంచి ఫలాలను తెచ్చి చూపిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తాను.
- రాజశేఖర్‌రెddy
Money Dharmam
ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కధ
----------------------------------------
“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”
వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది,
సమంగా ఉంటే బంగారం పండుతుంది,
అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.
ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...
తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !
*అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.*
ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు.
*మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!*
పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు.
అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.
*ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన ఉత్సవానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.*
వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.
రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు,
కానీ, తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.
తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.
మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు.
ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.
ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, *‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘* అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, *‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’* అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది.
తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.
‘చూసారా స్వామి ! ఇదీ *చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’* అంది, మండోదరి.
‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.
చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, *ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’* అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. *‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.* హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.
మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది.
ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది.
అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగలది ధర్మవర్తనం
నీతి : *క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది.*
అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.
మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.
దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే మనది అవుతుంది !
ఇది సత్యం !
ఇదే వైష్ణవ మత సిద్ధాంతం !!
Friday, 12 October 2018
Green leaves
నిన్న మార్కెట్ లో తెల్లగలిజేరు ఆకు కొన్నాక '' ప్రతివారం గలిజేరు ని మాత్రం వదలకుండా అడుగుతారెందుకు ''అన్నది అమ్మే అమ్మాయి.
రెట్టించిన ఉత్సాహం తో,ఆవేశంతో వర్షం పడుతున్నా పట్టించుకోకుండా గలిజేరు కధ చెప్పి వచ్చాను .''ఈ గుణాలన్నీ విన్నాక రేపటి నుండి దీని ధర మాత్రం పెంచేయకు'' అన్నాను చివర :-)
పక్కన ఉండి ఇదంతా విన్నావిడ , ''ఇవన్నీ ముందే తెలిస్తే ఈమెకి మిమ్మల్ని ఈ సంగతులు చెప్పనిచ్చేదాన్ని కాదు ఎందుకంటే సాటి మనిషి అవసరానికి సాయపడే లక్షణం తగ్గి వ్యాపారం చేసుకునే లక్షణం ఈ కాలపు మనుషులకి పెరిగింది కదా అందుకని ''అన్నది నవ్వుతూ .
మొక్క గురించి నేను చదివిన,విన్న, తెలిసిన నాలుగు విషయాలు ..
వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు . కొన్ని మూలికల గురించి చదువుతూంటే భగవంతుడు ఎంత దయామయుడు అనిపిస్తుంది . అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని , ఔషధాలను అతి దగ్గరగా , సులువుగా , చవకగా ఉంచినందుకు . ప్రకృతిని నాశనం చేస్తూన్న మనిషికి తనని తాను నాశనం చేసుకుంటున్నాడన్న స్పృహ ఎప్పుడు కలుగుతుందో అనిపిస్తుంది . ఆరోగ్యం లేని ధనం , జీవితం , ఆయుష్షు ఎవరికి, ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి .
మన మొక్క విషయానికి వస్తే ,దీన్ని పునర్నవ అని కూడా అంటారు . ఆయుర్వేద మందుల్లో anti inflammatory గా , anti oedema (ఒంట్లో నీరు చేరటం ) ముందుగా వాడే పునర్నవాసవం , రక్తాన్ని వృద్ది పరచటానికి వాడే పునర్నవ మండూరం తయారు చేసేది ఈ మొక్కతోనే .
వర్షాభూ అని కూడా అంటారు . వర్షా కాలం లో మొలిచేది కాబట్టి .ఇంగ్లీష్ లో boerhavia diffusa .నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు.తెలుపు , ఎరుపు , నలుపు. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు .వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.
తెల్ల గలిజేరు వేడి చేసి , కఫము ,దగ్గు ,విషము ,హృద్రోగాలను ,పాండు రోగాలు , శరీరానికి కలిగే వాపులు , వాత వ్యాధులు , కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది . లివర్ వాపు ని , గుండె బలహీనత వల్ల వఛ్చిన వాపుని పోగొడుతుంది . కిడ్నీ లను బాగు చేసి సక్రమం గా పని చేసేలా చేస్తుంది . బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి , పాండు రోగము , శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి , వాతము , కఫము , ఉబ్బు పోగొడుతుంది .
నెల రోజులు తింటే కుష్ఠుని కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది . ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి , కంటి చూపు మెరుగు పడుతుంది . ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది . ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం , సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి . అలా మూడు రోజులు తినాలి .
ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి . గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి , వాతం నొప్పులున్న చోట , కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి . నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు . గలిజేరు ఆకు రసం తీసి సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి ఉంచాలి . రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగితే గుండె దడ , గుండె బలహీనత తగ్గుతాయంటారు
శరీరాన్ని detoxify చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది . శరీరం లో యూరియా లెవెల్స్ ని తగ్గిస్తుంది . diuretic గా పని చేస్తుంది . గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది .
ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది . నల్ల గలిజేరు కారం , చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది . ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె .
పప్పులో కలిపి వండుకుంటారు , ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి లో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు . ఆకుల తో కషాయం చేసి తాగుతారు . ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది .
తెల్ల గలిజేరు వేరు , ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది.
తెల్లగలిజేరు వేరు , నీరు , పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది .
ఈ ఆకు కూరని అతిగా తినకూడదు . తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి .diabetes , అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికం గా తింటూ ఈ ఆకు కూరని మితం గా తినాలి . ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాడాలి . lactating తల్లులు , గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలం లో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది . చాలా త్వరగా కిడ్నీ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అయ్యింది
పొలాల నిండా ఉంటుంది,కాలువ గట్లు మీద,బీడు భూముల్లో దొరుకుతుంది...ప్రయత్నించండి,తప్పకుండా దొరుకుతుంది...
దీనిని అటుకమామిడి అనికూడాపిలుస్తారుగా
Wednesday, 26 September 2018
Medical Mafia
Medical Evolution;
- Our ancestors had a vast knowledge about the role of consciousness in health
- Civillization goes back to days when the geography of the world was vastly different and humanity has survived several cataclysmic changes
- Knowledge about herbs and healing foods is found in all ancient civilizations
- Medicine in its present form began with naturopathy
- When men were healthy they stayed at the peak of health with raised spiritual awareness, mediation on the ONE, control over thoughts and passions, and energy uplifting exercises
- Among the aware health was a vehicle that had to be at its best to achieve the goal of life - God realization
- Gradually ayurveda or organized medicine arrived on the scene and developed based on the above and primarily to serve kings who deviated from rules and soldiers who were injured in battle
- Ayurveds observed disease patterns in all sections of society and also recognized and treated "yogaza vyadhi" or illness that resulted from intense spiritual aspirations
- Knowledge of ayurveds was more than enough to treat disease conditions in civilized society. Their knowledge of surgery is slowly gaining recognition
- Morality, ethics, and spirituality is the backbone of holistic sciences. According to ayurveda the world operates on Dharma or righteousness and collapses when it is not observed
- Muslims in India learnt from ayurveds to develop and fine tune the Unani system of medicine that is identical to principles of ayurveda
- In the western world herbalism existed in various forms under the Greek systems that also interacted with India and learnt from Indian universities
- Western medicine was in essence about palliation and destruction of symptoms without knowledge of the inner workings of the mind and body and its relationship with nature. The early methods were extremely crude, shocking, and defied logic
- Hahnemann developed homeopathy in 1796 as being a doctor he was concerned about adverse effects and long term impacts. He wanted to cure people and restore their health
- He perfected the art of homeopathy with his vast knowledge and keen powers of observation. He confirmed morality and ethics to be the basis of health
- The western world was full of quacks who peddled strange concoctions and became rich by dubious means. One such quack was William Rockefeller, the father of J D Rockefeller, the father of modern medicine
- William trained his son to abandon all notions of goodness and become a ruthless crook
- Rockefeller Jr sensed his El Dorado to be oil as he knew the world would soon run on it. As he captured the entire oil industry using the strength of well oiled goons and chicanery he became central to certain secret societies who were looking forward to taking over the world
- The world would soon be run by economists who felt profit was the goal and that nature, morality and ethics stood on the way
- Rockefeller and other barrons of the day fitted the plan to a T
- The era of chemical drugs began primarily because herbs could not be patented for profit. Health was never the goal. Expansion, global dominance and profits was
- The ethical physicians of the day prefered to migrate from this system and studied holistic sciences and homeopathy to benefit their patients as they observed results and cures
- The year 1796 also saw the birth of Jenners vaccination which was opposed tooth and nail by experienced physicians as they were shocked by the crude method and knew nothing good would ever come out of it
- Observing the shocking impacts of vaccination, realizing that medicine was not able to benefit vaccinated populations, and shocked by the magnitude of harm observed physicians switched over in hordes to homeopathy and allied sciences
- The AMA was formed by quacks who masqueraded as qualified doctors to stem this exodus. They also prepared a plan to expand and grow
- Rockefeller put a stamp on that plan when his designated expert Abraham Flexner, a retired school teacher, adopted that plan as the Flexner Report and gave an excuse to Rockefeller to launch a new system of medicine
- Rockefeller took over the entire medical structure of the day, fired all those who refused to toe the line, closed all holistic departments from teaching schools and hospitals, and set up the Rockefeller Institute of Medical Research
- Oil and chemicals became the new medicine
- He set up the UN and WHO in essence to fulfil the wishes of the secret societies who founded the USA and to become the medicine barron
- Vaccination became the focal point as they caused chronic disease states that had no cures and could only be managed
- Diseases exploded in society and medicine grew into an empire that would usher in the new world order
- Rockefeller and other elite preferred homeopathy and herbals
- The merger of I G Farben ensured that toxins would get into the food chain and atmosphere feeding the growth of diseases and the subjugation of humanity
- This group does all in its power to hide the fact that it is toxicity that is behind diseases
- Morality, ethics, spirituality, nature are today dirty words as they would upset the apple cart. Vaccinated populations sacrifice the normal working of the body mind complex to become pawns of the game and their own enemies
- The pharma, agri, food, and chemical industry are offshoots of the Rockefeller - I G Farben combine and they invest in governments and political parties to subvert all laws and rule the world
- Health would be impossible in the current scenario unless something drastic leads to the fall of the evil empire
Gober gas
ఆవుపేడతో బయోగ్యాస్, సిలిండర్‌కు రూ.150-200 మాత్రమే****పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో గల లాంబ్రీ గ్రామస్థులకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకొన్న పనిగా అనిపించేది. అయితే ఆ అసాధ్యాన్ని కొంతమంది రైతులు సుసాధ్యం చేసి చూపించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తక్కువ ఖర్చుతో లభించే గోబర్‌గ్యాస్‌నే వంటకు ఉపయో గిస్తున్నారు.
ఆవుపేడను ఉపయోగించి వంటగ్యాస్‌ను ఉత్పత్తిచేసి, ఇంటింటికి సరఫరా చేస్తూ ఆ గ్రామ రైతులు అధిక లాభాలు పొందుతున్నారు.
మొదట గ్రామస్థులంతా ఒక కమిటీగా ఏర్పడి బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు 2500 కిలోల ఆవుపేడను ఉపయోగించి గోబర్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆవుపేడకు క్వింటాల్‌కు రూ. 8 చొప్పున రైతులకు చెల్లిస్తారు.
లాంబ్రీకి చెందిన జస్విందర్‌సింగ్ ఉన్నత చదువుల కోసం దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ వ్యర్థాల నుండి ఉత్పత్తులను రాబట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి ప్రయోగమే తన గ్రామంలో కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయంలో కొంత పరిశోధన సైతం చేశాడు. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత ఈ విషయాన్ని గ్రామస్థులతో పంచుకున్నాడు. వారు సానుకూలంగా స్పందించారు. ప్రణాళికలు సిద్ధం చేసి పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లి తన ప్రాజెక్టు గురించి వివరించాడు.
కేంద్ర ప్రభుత్వం నుండి 2 లక్షల ఆర్థిక సహాయం లభించింది. తన గ్రామంలోనే గోబర్‌గ్యాస్ ప్లాంట్ నిర్మించాడు. గ్రామ సొసైటీ ద్వారా ఇంటింటికి గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ రీడింగ్ మీటర్లు సప్లై చేశాడు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు.
పేడ సేకరించడానికి వెళ్లిన ట్రాక్టర్‌లో త్రాసు కూడా ఉంటుంది. దాంతో రైతు నిత్యం ఎన్ని కిలోల పేడ అమ్ముతున్నారో రికార్డు చేస్తారు. గ్యాస్ ఖర్చు పోను మిగతా డబ్బు అతని బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.
అలా సేకరించిన ఆవుపేడను పులియబెట్టి, గ్యాస్ ఉత్పత్తిచేసి భూమి లోపలి నుండి వేసిన పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. గ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయిన పేడ ద్రవాన్ని సొసైటీ సభ్యుడుకైతే 5000 లీటర్లకు రూ.600 చొప్పున; సభ్యులు కాని వారికి 5000 లీటర్లు 800 చొప్పున అమ్ముతారు.
ఎల్పీజీ సిలిండర్‌కు నెలకు రూ. 800 నుండి 850 ఖర్చు అయితే; గోబర్ గ్యాస్ వల్ల నెలకు రూ.150-200 మాత్రమే ఖర్చు అవుతుంది.. అంతేకాకుండా ఇలా ఉత్పత్తి చేసిన గ్యాస్‌లో ఏమాత్రం కల్తీ ఉండదు. ఎంత గ్యాస్ ఉపయోగిస్తే అంతే రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
సొసైటీ ద్వారా గ్రామంలోని పాఠశాలకు మధ్యాహ్న భోజన తయారీకి అవసరమైన గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. లాంబ్రీలో విజయవంతమైన గోబర్‌గ్యాస్ పథకం చూసి.. ‘పంజాబ్ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ’ వారు ఇతర గ్రామాలకు సబ్సిడీ ఇచ్చి గోబర్‌గ్యాస్ ప్లాంట్‌లు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
చన్నువాలా, బడ్నికలాన్ గ్రామ ప్రజలు గోబర్ గ్యాస్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిచేసి, ఇతర గ్రామాల నుంచి మోటారు పంపుల ద్వారా తాగునీటిని సరఫరా చేసుకుంటున్నారు.
దాదాపు 300 మిలియన్ల పశుసంపద ఉన్న మనదేశంలో సుమారు మూడు మిలియన్ టన్నుల పేడ ఉత్పత్తి అవుతుంది. దీన్ని వృథా చేయకుండా తగిన విధంగా ఉపయోగిస్తే లాంబ్రీ గ్రామ ప్రజల వలె ఎవరైనా లాభాలు పొందొచ్చు. వీరిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.
భారత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ‘ఆర్గానిక్ బయో- ఆగ్రో రీసోర్సెస్ ధన్’ (పేడ-ధనం) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం వ్యర్థాల నుండి ప్రత్యామ్నాయ ఆదాయం పొందడం.
– అనిల్. కె
(జాగృతి సౌజన్యం తో)
Devi Nava Rathrulu Dasara
#దసరా #శరన్నవరాత్రులు
#దసరా(#విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో జరుపుకున్నప్పటికీ సందడి మాత్రం ఒకేలా ఉంటుంది. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపు కుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.
రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా ఉత్తరాది ప్రజలు రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు.
పాండవులు 12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో తమ ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజ ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు. విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది.
కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతోకూడ అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గ లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్కదేవిని మూడేసి దినములు పూజింతురు. ఈ తొమ్మిది రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలుకానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియు సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని, ఆయుధములను పెట్టి పూజంచుటచే ఆయుధపూజాదినము అనియు చెప్పబడును. మఱునాటి #దశమి తిథికి #విజయదశమి అని పేరు.
#నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.
మన దగ్గర ఆచరణలో ఉన్నది...
జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారంట. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.
ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.
తెలుగు వారు #దసరాని #పది #రోజులు #జరుపుకుంటారు. #ముందు #నవరాత్రులు #దుర్గ #పూజ #ఉంటుంది. #తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి #నవమి #వరకు #బతుకమ్మ #ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
#శరన్నవరాత్రులు:
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
#కనకదుర్గ #గుడి, #ఆంధ్ర #ప్రదేశ్, #భారతదేశం లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది #విజయవాడ #నగరం లో #కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది.
కనకదుర్గమ్మ గుడి గురించి...
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసు ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఉంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శువుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.
ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ తొమ్మిది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి(ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)
రెండవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
మూడవ రోజు: శ్రీ గాయత్రీ దేవి (విదియ-వృద్ధి )
నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
ఐదవ రోజు: కాత్యాయని దేవి
ఆరవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఏడవ రోజు: శ్రీ మహాలక్ష్మి దేవి
ఎనిమిదవ రోజు: శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)
తొమ్మిదవ రోజు : శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
పదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
పదకొండవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
శరన్నవరాత్రులు మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.
శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
శ్రీ దుర్గాష్టకమ్
ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః
ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః
దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా
శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా
భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః
ఫలశృతిః
యశ్చాష్టక మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్
దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తర్వాత మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరి .. గాయత్రి .. అన్నపూర్ణ .. మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చి అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందాం
దేవీ నవరాత్రులు – విశేషాలు :
చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రునితో కలసి ఉండే నక్షత్రాన్ని బట్టి ఆమాసం పేరు వస్తుంది. ఈ మాసంలో శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. దక్షిణాయనంలో ఇది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ ఉపనిషద్వాక్యమైన ‘మాత్రు దేవోభవకు ప్రతిబింబంగా మన సంస్కృతిని పరివారాన్ని సమైక్యతను పరిరక్షించే పవిత్ర స్త్రీ మూర్తిని ఈ శరన్నవరాత్రులలో సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపంలో శక్తి ప్రదాతయైన దుర్గగా జ్ఞానప్రదాతయైన సరస్వతిగా ఐశ్వర్య ప్రదాతయైన లక్ష్మిగా పూజిస్తాం.
మనకు దసరాలలో బొమ్మలకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. కొందరు సంక్రాంతికి పెడతారు. రకరకాల బొమ్మలను కొలువుగా తీర్చిదిద్ది పిల్లలను ముత్తైదువులను పేరంటానికి పిలిచి, రోజుకొక తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదిస్తారు. పాటలతో భజనలతో ప్రార్థనలతో జగదంబను స్తుతిస్తారు. దసరాలో నవమిని మహానవమి, మహార్నవమి అంటాం. ఇది అత్యంత ప్రధానమైన రోజు. మహార్నవమిరోజు జగదంబను తప్పనిసరిగా పూజించాలి. దశమినాడు పున్ణ పూజ, ఉద్వాసన జరుపుతారు. విద్యార్ధులు తదితర చదువరులు మూలనక్షత్రంలో సరస్వతీ పూజ చేయాలి. ఎక్కువగా ఉత్తరభారతీయులు విజయదశమినాడు శమీ పూజ చేస్తారు. ఈ రోజు పురజనులు ఊరి సరిహద్దులు దాటి ఈశాన్యదిక్కుగా ప్రయాణించి శమీపూజ నిర్వహించి వెనక్కి తిరిగి వస్తారు. దీనినే సీమోల్లంఘన అంటారు. అంటే సీమ (సరిహద్దు)ను ఉల్లంఘించడం (దాటడం). విజయదశమి నాడే షిరిడి సాయిబాబా మహా సమాధి చెందారు.
ఈ దసరా నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా ఉండి మనలో భక్తిని స్నేహాన్ని సౌభ్రాతృత్వాన్ని కలిగిస్తాయి. అనంత నామాలు రూపాలు గల అమ్మవారిని ఏ నామంతోగాని ఏ రూపంతో గాని భక్తి -ప్రపత్తులతో ఆరాధించే వారికి సర్వము మంగళకరము, శుభప్రదము.
అమ్మవారి అలంకరణలు :
1వ రోజు - శ్రీ బాల్రతిపుర సుందరిదేవి
2వ రోజు – శ్రీ గాయత్రి దేవి
3వ రోజు – శ్రీ అన్నపూర్ణాదేవి
4వ రోజు – శ్రీ కాత్యాయని దేవి
5వ రోజు – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి
6వ రోజు – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి
7వ రోజు – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి
8వ రోజు – శ్రీ మహిషాసురమర్దిని – మహార్నవమి
9వ రోజు – శ్రీ రాజరాజేశ్వరి – విజయదశిమి
మొదటిరోజు: బాలాత్రిపుర సుందరి :
మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి. శ్రీశక్తి కౌమారి రూపం ”బాల” -. అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది – ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. బాల త్రిగుణైక శక్తి – సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్శమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమ్ణ” అని నూటా ఎనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి ప్రత్యేకం గా పాయస నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారాయణం చెయ్యాలి.
రెండోరోజు: శక్తి అవతారం -గాయత్రి దేవి :
రెండో రోజు అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరిస్తారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారు. అమ్మ ప్రాత్ణకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజలందుకుంటోంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
మూడోరోజు: అన్నపూర్ణాదేవి :
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
నాలుగోరోజు: కాత్యాయని దేవి :
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అయిదోరోజు: లలితా త్రిపురసుందరి :
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్య్ర ద్ణుఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముత్తైదువులకు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి.
ఆరో రోజు: మహాలక్ష్మీదేవి :
కమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. ”ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి.లక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.
ఏడో రోజు: సరస్వతిదేవి :
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని ”విజయారంభం” అని పిలుస్తారు.
ఎనిమిదో రోజు: మహిషాసుర మర్ధిని :
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే ”మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరిమ్చి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి ¬మం చెయ్యాలి. అమ్మవారికి ”ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం, గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.కొన్ని ప్రదేశాలలో ఈ రోజున అమ్మవారి ఉగ్రరూపానికి జంతుబలులు ఇస్తారు. కానీ ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది.
తొమ్మిదో రోజు (విజయదశిమి): రాజరాజేశ్వరీ దేవి :
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి...పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి...రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే…”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.
Father Significance in Hinduism
పితృదేవోభవ :-
దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో...’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.
తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది. ‘పుత్ర శబ్దానికి- తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.
‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు... అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు... అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు... ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు. అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.
అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం. ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే! కాబట్టే విగ్రహవాక్యం- ‘తల్లియును తండ్రియును’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం. ‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే- భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.
కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’లను మొదటి రెండుగా చెబుతారు. వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక! ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక! లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు. అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!
అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ. ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!
అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన. శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం !!
Hanuma Communication skills
కమ్యునికేషన్ స్కిల్స్...
పురాణ గ్రంధాలలో వీటి గురించి చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడిని నుండి నేర్చుకోవచ్చు.
మాట్లాడే విద్యకి ఉన్న గొప్పదనం ఆదికావ్యం
వాల్మీకి రామాయణంలోనే కనబడుతుంది. హనుమంతుడు అంటే రామభజన చేసేవాడని సామాన్యుల భావన. కాని వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కేవలం భజన పరుడుకాదు. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షా పరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా, ఆదర్శవంతముగా నిర్వహించిన వాడు.
ఎలా మాట్లాడాలి??
👉 శాస్త్రానుసారం ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతాడు పవనకుమారుడు. అది ఎలాగన్నది కిష్కింధ కాండలో మొదటిసారి హనుమంతుడు, రాముడిని కలిసినపుడు, రాముని నోట పలికించాడు వాల్మికీ మహర్షి.
ఎలా మాట్లాడాలంటే..
👉 విషయం స్పష్టముగా ఉండాలి
👉 వాక్యంలో దోషాలు ఉండకూడదు.
👉 ముఖము, కన్నులు, నుదురు, కనుబొమ్మలు..ఏ అవయవంలోనూ వికార చేష్టలు ఉండకూడదు.
👉 విషయంతో సంబంధంలేని మాటలు మాట్లాడకూడదు.
👉 సందిగ్ధంగా ఉంచకూడదు.
👉 మాటలను ఆపి ఆపి మాట్లాడకూడదు
👉 మాట మనసులోనుండి రావాలి
👉 మధ్యమ స్వరంతో మాట్లాడాలి
ఇలా హనుమ మాట్లాడినట్లు అభ్యాసం చేయగలిగితే, ఎవరైన, ఏ రంగంలోనైనా, ఎక్కడైన రాణించగలరు.
ఎవరితో ఎంత మట్లాడాలి ??
ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు అనేది ప్రతీరోజు మనం చూసే ప్రధాన అంశం. నీతులు, నియమాలు ఒక వాక్యంలో చెప్పి వదిలేస్తే హృదయానికి హత్తుకోవు. విషయం అర్ధం అయ్యేలా స్పష్టముగా చెప్పాలి.
దూతగా...
మధ్యవర్తిగా వెళ్ళినపుడు ఎలా మట్లాడాలి అనేది హనుమంతుడు రామదూతగా అశోకవనంలో సీతమ్మ తల్లితో మాట్లాడిన తీరు గమనించాలి.
అశోకవనంలో ప్రాణత్యాగానికి పాల్పడుతున్న సీతను చూసాడు హనుమ. ముందుగా ఆమె చేత ఆ ప్రయత్నాన్ని విరమింపచేయాలి, రాముడు రాబోతున్న వార్త తెలపాలి, అంతకుమించి తాను రామ దూత అని నమ్మించాలి. ఏ విధముగా సంభాషించాలి అని అలోచించి “ దశరధుడు అనే మహారాజు అయోధ్యకు రాజు....అని విషయాన్ని చెప్పడం మొదలు పెట్టాడు చెట్టు మీద కూర్చునే, రాముడి పేరు తప్ప మరొకరి పేరు తెలియని లంకలో దశరధమహారజు పేరు వినబడిందంటే, తన ఆత్మీయులు ఎవరో వచ్చారని అర్ధమై ఆత్మహత్యా ప్రయత్నం మానేసింది సీత. అప్పుడు పవనకుమారుడు సీత ఎదురుగా వచ్చి, రాముడు వానర సైన్యంతో సీతను విడిపించడానికి వస్తున్నడనే విషయాని సీతమ్మకి తెలియచేస్తాడు. తాను చేసిన సాహసాలు ఒక్కటి కూడ చెప్పడు.
రాముడు వచ్చేవరకు సీత జీవించి ఉండేలా చేయాలి, అందుకు ఏం చేయాలి? రాముడు రాబోతున్న వార్త చెబితే చాలు, తన సాహసాల గురించిన ప్రస్తావన అవసరంలేదు. అందుకే హనుమ అవసరం మేరకు మాత్రమే మాట్లాడాడు.
స్నేహితులతో...
సీతను చూసి, రావణుడిని హెచ్చరించి, లంకా దహనం చేసి తిరిగి తన కోసం ఎదురు చూస్తున్న వానరసేనను కలుస్తాడు హనుమ. సీతను చూసాను అనే మాట మాత్రమే చెప్పి వారి మనసులను కుదుట పరుస్తాడు. ప్రాణాలు కుదుటపడ్డ వానరులు, అసలు ఎలా సముద్రాన్ని దాటగలిగావు, సీతమ్మను ఎలా కనిపెట్టావు అని అడిగారు.
ప్రభువుతో...
సీతమ్మ చెప్పిన, చిత్రకూటంలో జరిగిన ఒక సంఘటనను హనుమ రాముడితో చెప్పాడు. (తాను సీతను చూసాననే దానికి ఆనవాలుగా). తరువాత అసలక్కడ సీతమ్మ ఎలా ఉంది, రావణుడి గురించి వివరంగా తెలిపాడు.
ముఖ్యమైన విషయం ముందే చెప్పేయాలి. అంతేగాని టి.వి సీరియల్ లా సాగదీయకూడదు. అవసరమైన విషయం ముందు చెప్పేసి, తరువాత విషయాలు నెమ్మదిగ చెప్పాలి.
ఇలా ప్రత్తి ఒక్క పురాణం నుండి మనం నేర్చుకోవలసింది, నేర్చుకుని ఆచరించవలసిన అంశాలు చాల ఉంటాయి. కనీసం మనం ఒక్కదాని ఆచారణలో పెడితే, దాని ఫలితాలకు తిరుగుండదు.
ఏమంటారు ?
Subscribe to:
Posts (Atom)