Saturday, 27 October 2018

zbnf reddy ananathapur

ఉద్యాన రైతుగా ఐటీ కంపెనీ బాస్‌ https://kalpatharuorganics.com/news 20-10-2018 00:54:28 జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ ఎరువులతో సాగు...మేళా, వెబ్‌సైట్‌ ద్వారా పండ్ల విక్రయం అనంతపురం జిల్లాకు చెందిన ఆయన ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత. ఆయన భార్య ఒక ఆర్గానిక్‌ కంపెనీ సారథి, ఇంజనీరింగ్‌ చదువుతున్న వారి కుమార్తెతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ రోడ్డు వెంట పంట నూర్పిడి చేస్తున్న రైతుల్ని చూశారు. దేశంలో మిగిలిన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుండగా వ్యవసాయం మాత్రం ఎందుకు సాంకేతికంగా వెనుకబడి వుందనే కూతురు ప్రశ్న ఆ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేతలో ఆలోచనలు రేకెత్తించింది. ఆ కుటుంబం అడుగులు వ్యవసాయం వైపు పడేలా చేసింది. కరువులో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆదుకునేలా చేసింది. నగరంలో ఉద్యోగాలు చేసుకుంటూనే తీరిక వేళల్లో స్వగ్రామంలో బంధువుల సహకారంతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నదీ కుటుంబం. వివిధ రకాల పంటలతో పాటు అరుదైన పండ్లతోటలు పెంచి ఆంధ్రా మామిడిపండ్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించి, ఒకటికి ఐదు రెట్ల లాభాలను గడిస్తున్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం రాగిమేకలపల్లికి చెందిన మసుకోట రాజశేఖర్‌ రెడ్డి వ్యాల్యూపాయింట్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. భార్య విజయ లక్ష్మి ఓ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. కుమార్తె పూజిత ఇంజనీరింగ్‌ చదువు తోంది. రాజశేఖర్‌రెడ్డి వృత్తిరీత్యా గత 20 ఏళ్లలో అమెరికా, ఐరోపా, ఆస్ర్టేలియా, ఆసియా ఖండాలలో పర్యటించి అపార అనుభవాన్ని గడించారు. సొంత జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు గమనించి, కుమార్తె మాటలతో స్ఫూర్తి పొందిన ఆయన 2009లో వ్యవసాయం ప్రారంభించారు. రాగిమేకలపల్లి వద్ద 47 ఎకరాల పొలం ఉండగా మొదట 15 ఎకరాల్లో పండ్లతోటలు, చిరుధాన్య పంటలైన సామలు, కొర్రలు, ఉలవలు, అలసందలు సాగు చేశారు. మామిడిలో 11 రకాల చెట్లతో ప్రారంభించి ప్రస్తుతం తోటలో 28 రకాల పండ్ల చెట్లను సాగుచేస్తున్నారు. రెండువేల మామిడి మొక్కల్లో రత్నగిరి ఆల్ఫాన్స్‌ బెంగళూరు అగ్రికల్చర్‌ యూనవర్సిటీ నుంచి, కేసర్‌, ఇమాం పసంద్‌, తదితర రకాల చెట్లను రాజమండ్రి నుంచి తెప్పించారు. వాటితోపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి గాను ఆరెంజ్‌, అవకాడొ, బ్రెడ్‌ఫ్రూట్‌, స్టార్‌ ఫ్రూట్‌, మ్యాంగో స్టీమ్‌, రోజ్‌ ఆపిల్‌, గోడంబి, రామాఫలం, జాక్‌ఫ్రూట్‌, చెర్రీస్‌, ఉసరి, పనస, అల్లనేరేడు తదితర రకాలు పెట్టారు. పొలంచుట్టూ ట్రెంచ్‌ ఏర్పాటుచేసి అవసరమైన చోట ఫారంపాండ్‌, చెక్‌డ్యామ్‌లు, గట్లు ఏర్పాటుచేశారు. వర్షం పడినప్పుడు నేలపై పడే ప్రతి చినుకూ భూమిలో ఇంకేలా చేశారు. ఇలా చేయడం ద్వారా ఒకే బోరుతో 15 ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగుచేస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తారు. ఆస్ర్టేలియా, జర్మనీకి చెందిన నిపుణుల వద్ద ఎరువుల తయారీలో ఏడు రోజులు శిక్షణ పొందారు రాజశేఖర్‌రెడ్డి. జర్మన్‌ పద్ధతిలో తయారుచేసుకున్న మిశ్రమంతో పాటు సేంద్రియ ఎరువులతోనే అన్ని పంటలూ పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడికాయలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయించడం వల్ల రూ.15 లక్షల లాభాలు సాధించారు. ఇందుకోసం దంపతులిద్దరు బెంగళూరులో అపార్ట్‌మెంట్‌ల వద్ద మేళా ఏర్పాటుచేశారు. ఆంరఽధా పండ్లకు గిరాకీ పెరగడంతో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో ఆంధ్రమ్యాంగో డాట్‌కామ్‌, కల్పతరువు ఆర్గానిక్స్‌ పేరుతో తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక బాక్సుల్లో సరఫరా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తోటలో కిలో రూ.25 ధర పలికే మామిడిపండ్లకు రూ.150 లభించింది. వీరి వినూత్న సాగు పట్ల ఆకర్షితులైన పలువురు బడా కంపెనీ ఉద్యోగులు వారు కూడా గ్రామాలకు వెళ్లి పంటలు సాగు చేయడానికి సిద్ధం కావడం విశేషం. స్వగ్రామంలో ప్రకృతి వైద్యశాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని వ్యవసాయాభివృద్ధికి ఎలా ఉపయోగించాలనే అంశంపై ఐక్యరాజ్యసమితి కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాను. వ్యవసాయ క్షేత్రాన్ని విద్యార్థులు, రైతులకు స్ఫూర్తినిచ్చే రీతిలో తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. జర్మన్‌ పద్ధతిలో తయారుచేసే ఎరువును స్థానిక రైతులకు తక్కువ ధరకు విక్రయించాలని ఆలోచిస్తున్నాను. త్వరలో రాగిమేకల వద్ద ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం. పండ్ల మొక్కల నర్సరీ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తాం. విద్యార్థులు తాను ఇచ్చిన మొక్కలను పెంచి ఫలాలను తెచ్చి చూపిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తాను. - రాజశేఖర్‌రెddy

No comments:

Post a Comment